: ఓటు విలువను మహిళల పరువుతో పోల్చుతూ శరద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఓటు విలువను ప్రజలకు తెలియజేయాలన్న తొందరలో జేడీయూ అధ్యక్షుడు సీనియర్ నేత శరద్ యాదవ్ నోరు జారారు. ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఓటు విలువను మహిళల పరువుతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఓటు విలువ అమ్మాయిల పరువు కన్నా ఎక్కువని అన్నారు. కన్న కూతురి పరువు కన్నా ఓటు వేయడమే ముఖ్యమని చెప్పారు.
కూతురిపై అత్యాచారం జరిగితే, ఆ గ్రామానికి మాత్రమే చెడ్డ పేరు వస్తుందని, ఓ కుటుంబానికి మాత్రమే అన్యాయం జరిగినట్టని అభివర్ణించిన ఆయన, ఓటును అమ్ముకుంటే, దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని అన్నారు. అమ్మాయిల పరువును తక్కువ చేసి మాట్లాడిన ఆయన మాటలు వైరల్ కాగా, ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
కాగా, శరద్ యాదవ్ మహిళలను కించపరుస్తూ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గతంలో దక్షిణాది మహిళలు నల్లగా ఉంటారని రాజ్యసభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగగా, క్షమాపణలు కూడా చెప్పారు.