: డిక్షనరీలోనే లేని 'ట్రిలియనీర్'... ఘనత సాధించనున్న తొలి వ్యక్తిగా బిల్ గేట్స్?


ధనవంతులను గురించి వర్ణించాల్సి వచ్చినప్పుడు మిలియనీర్, బిలియనీర్ వంటి పదాలను వాడుతామన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అంతకన్నా పెద్ద పదం ప్రపంచ డిక్షనరీల్లో ఎక్కడా లేదు. బిలియనీర్ హోదాను దాటి మరింత ముందుకు వెళితే... బిలియన్ తరువాతి పదం ట్రిలియన్... ట్రిలియన్ డాలర్లను మించిన ఆస్తులున్న వ్యక్తిని 'ట్రిలియనీర్' అనాలి. ఇక ప్రపంచంలో తొలి ట్రిలియనీర్ గా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆవిర్భవించనున్నారని రీసెర్చ్ సంస్థ ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ అంచనా వేసింది.

మరో 25 సంవత్సరాల్లో బిల్ గేట్స్ తొలి ట్రిలియనీర్ అవుతారని, అప్పటికి ఆయన వయసు 86 సంవత్సరాలవుతుందని తెలిపింది. 2009 నుంచి బిల్ గేట్స్ ఆస్తుల విలువ 11 శాతం వృద్ధితో సాగుతోందని, ఇదే వృద్ధి కొనసాగితే ఆయనే తొలి ట్రిలియనీర్ అవుతారని పేర్కొంది. 2006లో 50 బిలియన్ డాలర్లుగా ఉన్న బిల్ గేట్స్ ఆస్తులు ఇప్పుడు 75 బిలియన్ డాలర్లకు పెరిగాయని గుర్తు చేసింది. కాగా, బిల్ గేట్స్ సహా 8 మంది బిలియనీర్ల వద్ద ప్రపంచంలోని 360 కోట్ల మంది సంపద విలువకు సమానమైన ఆస్తులున్నాయని ఆక్స్ ఫాం ఇటీవల ఓ నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News