: రిపబ్లిక్ డే వేడుకలే లక్ష్యంగా ఆఫ్గన్ వాసుల రూపంలో ఉగ్రవాదులు: నిఘా వర్గాల హెచ్చరిక


పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు, ఈ రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా ఆఫ్గన్ వాసుల గుర్తింపు కార్డులతో దేశంలోకి చొరబడ్డాయన్న అనుమానాలను నిఘా వర్గాలు వ్యక్తం చేశాయి. గురువారం నాడు జరిగే రిపబ్లిక్ వేడుకలే వీరి లక్ష్యమని ఢిల్లీ పోలీసులకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. ప్రధాని మోదీ సహా, ఇతర వీఐపీలకు ఇచ్చే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తో పాటు ఢిల్లీ పోలీసులు అదనపు భద్రతను కల్పించాలని, రాజ్ పథ్ కు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని అన్ని భవనాల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. దేశంలోని ఆఫ్గన్ పాస్ పోర్టులతో ఇటీవలి కాలంలో వచ్చిన వారందరినీ పరిశీలించాలని సూచించింది. రిపబ్లిక్ పరేడ్ జరిగే మార్గమంతటా స్నిప్పర్స్, స్పాటర్స్ లను నియమించే దిశగా ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్పీజీ డైరెక్టర్ ల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా ఏడంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని అధికార వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News