: ఒకరిని ఒకరు ఆహ్వానించుకున్న ట్రంప్, మోదీ
డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైన తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అమెరికాకు నిజమైన స్నేహితుడు, భాగస్వామి ఇండియానేనని అభివర్ణించిన ట్రంప్, ఈ సంవత్సరంలో ఓసారి అమెరికాను సందర్శించాలని మోదీని కోరారు. ఆర్థిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్యా ఉన్న బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడంపై రెండు దేశాల అధినేతలూ మాట్లాడుకున్నారు.
దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల ప్రస్తావనా వచ్చింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే దిశగా అమెరికాకు ఇండియా అత్యంత కీలకమని ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక అమెరికా అధ్యక్ష హోదాలో ఇండియాకు ఓ సారి రావాలని ట్రంప్ ను మోదీ ఆహ్వానించారు. ఇందుకు ఆయన్నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపరచుకునేందుకు కలసి పనిచేయాలని ట్రంప్, తాను ఏకీభవించినట్టు మోదీ తెలిపారు.