: జల్లికట్టు ముగిసింది.. ఇప్పుడు కంబళ వంతు.. ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కర్ణాటక కసరత్తు
తమిళనాడులో పెద్ద ఎత్తున నిర్వహించిన జల్లికట్టు ఉద్యమాన్ని పలు రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. కర్ణాటకలో నిషేధం అమలులో ఉన్న 'కంబళ' క్రీడను తిరిగి నిర్వహించేందుకు ఆ రాష్ట్రం సమాయత్తమవుతోంది. ఇక్కడి తీర ప్రాంతాల్లో ప్రతి ఏటా గేదెలతో ఈ క్రీడను నిర్వహిస్తారు. జల్లికట్టును నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఇప్పుడు కర్ణాటక కూడా ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి 'కంబళ'ను నిర్వహించాలని యోచిస్తోంది.
ఈ క్రీడను వ్యతిరేకించేవారు ఎవరూ లేరని, అయితే దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని, త్వరలోనే అది విచారణకు వస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కోర్టు తీర్పును బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని స్పష్టం చేశారు. అయితే జల్లికట్టుకు, కంబళకు సంబంధం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.