: క్రీజులోకి వచ్చేసి మరీ అవుటైన కివీస్ బ్యాట్స్ మన్.. ఇదో అరుదైన డిస్మిసల్!


క్రికెట్ చరిత్రలో అరుదైన ‘డిస్మిసల్ (ఔట్)’ బంగ్లా-కివీస్ జట్ల మధ్య నమోదైంది. బంగ్లాదేశ్ జట్టుతో క్రైస్ట్‌ చర్చ్‌ లో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్‌ లో కివీస్ చివరి వికెట్‌ ను రనౌట్ రూపంలో కోల్పోయింది. అయితే ఈ ఔట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన అవుట్ గా నిలిచింది. రన్ కోసం పరుగెత్తిన వేంగర్ బంతి కీపర్ ను చేరేసరికి క్రీజు లోపలికి వచ్చి బ్యాటు పెట్టేశాడు. అయితే తన వేగాన్ని నియంత్రించే క్రమంలో గాల్లోకి ఎగిరాడు. సరిగ్గా అదే సమయంలో బంగ్లా కీపర్ నురుల్ హసన్ బెయిల్స్ తొలగించి అప్పీల్ చేశాడు. దానిని థర్డ్ అంపైర్ ఎరస్మాస్ అన్ని కోణాల్లో పరిశీలించి, బ్యాట్, కాళ్లు నేలపై లేకపోవడంతో ఔట్ గా నిర్ధారించాడు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

  • Loading...

More Telugu News