: ప్రజావేగులను ప్రోత్సహించాలనుకుంటున్నాం: ట్రంప్ పై వికీలీక్స్ గురి


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రజా వేగు వికీలీక్స్ గురిపెట్టింది. డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ఆదాయపన్నుల రిటర్న్స్ సమాచారం వెల్లడించేది లేదని ట్రంప్ సలహాదారు కాన్వే ప్రకటించిన నేపథ్యంలో వికీలీక్స్ చేసిన ట్వీట్ అమెరికాలో కాకరేపుతోంది. ట్రంప్ ఆదాయపన్ను వివరాలను తామైతే బయటపెట్టాలని కోరుకోవడం లేదని, ప్రజావేగులను ప్రోత్సహించాలని భావిస్తున్నామని వికీలీక్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆదాయపన్ను వివరాలు వెల్లడించాలంటూ వైట్ హౌస్ కు 2,30,000 మంది సంతకాలు చేసిన పిటిషన్ పెట్టారు. వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్ సంయుక్తంగా చేసిన సర్వేలో ట్రంప్ ఆదాయ రిటర్న్స్ వివరాలు తెలుసుకోవాలని 74 శాతం మంది కోరుకుంటుండగా, అందులో 43 శాతం మంది రిపబ్లికన్లు ఉండడం విశేషం. 

  • Loading...

More Telugu News