: షారూఖ్ ను దావూద్ ఇబ్రహీంతో పోల్చిన బీజేపీ జనరల్ సెక్రటరీ


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చుతూ బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రయీస్' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న షారూఖ్ గుజరాత్ లోని వడోదర రైల్వే స్టేషన్ లో ఆగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్పందించిన విజయ వర్గీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం రోడ్డు మీదకి వచ్చినా అతనిని చూసేందుకు జనాలు గుమిగూడుతారని, జనాల సంఖ్యతో పాప్యులారిటీని కొలవలేమని ఆయన వ్యాఖ్యానించారు.

 దీనిపై తానింకేమీ మాట్లాడనని, తానేం చెప్పాలనుకున్నానో ప్రజలకు అది అర్థమైందని ఆయన చెప్పారు. గత ఆదివారం 'రయీస్' సినిమాపై కామెంట్ చేస్తూ, 'రయీస్' (సంపన్నుడు, నాయకుడని అర్ధం) దేశానికి చెందనప్పుడు దానివల్ల ఏమీ లాభం లేదు... అందుకే మనం 'కాబిల్' కు  మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఇది వైరల్ గా మారి షారూఖ్ అభిమానుల ఆగ్రహానికి గురికావడంతో బీజేపీనేత షైనా ఎన్సీ మాట్లాడుతూ, ఆ వ్యాఖ్యల్లో వివాదం లేదని, వర్గీయ తన అభిప్రాయం చెప్పారని అన్నారు. మంచి వారిని ప్రోత్సహించారే తప్ప ఆయన హృతిక్‌, షారుక్‌ లను లక్ష్యంగా చేసుకుని మాట్లాడలేదని తెలిపారు. 

  • Loading...

More Telugu News