: ‘దేశ్ బచావో’లో నాలుగో పాటను విడుదల చేసిన పవన్!


‘దేశ్ బచావో’లో భాగంగా నాలుగో పాటను కూడా విడుదల చేశారు. ఈ పాట లింక్ ను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘లే లే లే లే ఇవాళే లేలే..లే లే లేలే ఈరోజే లేలే...’ అంటూ సాగే ఈ పాటను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. పవన్ కల్యాణ్ సినిమా 'గుడుంబా శంకర్' చిత్రంలోని ‘లే లే లే ఇవాళే ను లే’ బాణీని పోలి ఉన్న ఈ పాటను రీ-మిక్స్ చేసింది డీజే పృథ్వీ సాయి. కాగా,  ‘దేశ్ బచావో’లో భాగంగా మొత్తం ఆరు పాటలను విడుదల చేయనుండగా, అందులో నాలుగు పాటలను ఈరోజు విడుదల చేశారు. ఈ రోజు ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒక పాట చొప్పున మొత్తం నాలుగు పాటలను విడుదల చేస్తామని అంతకు ముందు ట్వీట్లలో పవన్ పేర్కొన్న విషయం తెలసిందే. ఈ క్రమంలో నాల్గో పాటను విడుదల చేశారు.

  • Loading...

More Telugu News