: యూపీ ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్న సినీ నటి నగ్మా


ఉత్తరప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకతో కలసి సినీ నటి నగ్మా కూడా పాల్గొననున్నారు. యూపీలో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ తరపున నలభై మంది స్టార్ కాంపెయినర్లు రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం ఈ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, షీలా దీక్షిత్, రాజ్ బబ్బర్, మీరా కుమార్, సుశీల్ కుమార్ షిండే, ప్రియాంక గాంధీ, జనార్దన్ ద్వివేది, అహ్మద్ పటేల్, కమల్ నాథ్, ముకుల్ వాస్నిక్, సంజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్, భూపిందర్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్, కుమారి షెల్జా, జ్యోతిరాదిత్య సింధియా, మనీష్ తివారి, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్, నగ్మా తదితర ప్రముఖులు ఉన్నారు. కాగా, యూపీలో అధికార సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.   

  • Loading...

More Telugu News