: టీమిండియా యువ ఆటగాళ్లు భేష్... కోహ్లీ 'శభాష్' అంటున్న పాకిస్థాన్ దిగ్గజాలు


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై దేశవిదేశాల క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఆటతీరు రోజురోజుకీ దుర్భేద్యంగా మారుతోందని పాక్ దిగ్గజ క్రికెటర్లు తెలిపారు. పాక్ పేస్ దిగ్గజాలు వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్, స్పిన్ దిగ్గజం సక్లైన్ ముస్తాక్ లు కోహ్లీని అభినందనల్లో ముంచెత్తారు. కోహ్లీ ఫిట్ నెస్ అద్భుతమని వారు చెప్పారు. కోహ్లీ తనను తాను మలచుకున్న తీరు అనితరసాధ్యమని అభినందించారు. నిరంతరం ఫిట్ గా ఉండేందుకు కోహ్లీ తీసుకునే శ్రద్ధను కొనియాడారు. అదే సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్ల నిబద్ధతను ప్రశ్నించారు. ఆటమీద పాక్ ఆటగాళ్లకు ప్రేమ లేదని ఆరోపించారు. కొత్తగా నేర్చుకోవాలన్న తపన కూడా వర్థమాన క్రికెటర్లలో లేదని వారు పేర్కొన్నారు. భారత్ వర్థమాన క్రికెటర్లు ఎంతో మంది ఇప్పటికీ సునీల్ గవాస్కర్ ను బ్యాటింగ్ టిప్స్ అడగడం తనకు తెలుసని వసీం అక్రమ్ తెలిపారు. 

  • Loading...

More Telugu News