: మూడో పాటను విడుదల చేసిన జనసేన


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‘దేశ్ బచావో’ మ్యూజిక్ ఆల్బమ్ లో మరో పాట విడుదలైంది. ‘యూట్యూబ్’ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్ లో దేశభక్తి, స్ఫూర్తిదాయకమైన పాటలను రూపొందించినట్టు జనసేన తెలుపగా, అందులో తొలి పాట 'తమ్ముడు' సినిమాలోని 'ట్రావెలింగ్ సోల్జర్' పాటను పోలి ఉండడం విశేషం.  రెండో పాట గతంలో పవన్ కల్యాణ్ దర్శకత్వం వహించిన 'జానీ' సినిమాలోని వేడుక పాట 'నర్రాజు గాకురా మా అన్నయో ముద్దుల కన్నయ్య మనరోజు మనకుంది అన్నయ్యో' అంటూ సాగే పాటను పోలి వుంది. మూడో పాటగా ఖుషీ సినిమాలోని 'ఏ మేరా జహే ఏ మేరా దిల్ మేరా' అంటూ సాగే పాట శైలిలో రూపొందించారు. ఇది యువతలో భావోద్వేగాలను నింపుతుందని, యువతకు స్పూర్తి కలిగేలా చేస్తుందని పవన్ ట్విట్టర్ ద్వారా అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News