: ప్రధాని మోదీపై ‘శివసేన’ వ్యంగ్యాస్త్రాలు!
ప్రధాని నరేంద్ర మోదీపై బీజేపీ మిత్ర పక్షం ‘శివసేన’ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘శివసేన’ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 91వ జయంతి సందర్భంగా ఆ పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లో ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దివంగత బాల్ ఠాక్రే ఎన్నడూ తన ఛాతి కొలత గురించి ప్రస్తావించలేదని, అయినప్పటికీ, పాకిస్థాన్ సహా ఇతర శత్రువులు ఆయన పేరు వింటే భయపడేవారని పేర్కొంది. 2002లో గోద్రా అల్లర్లు జరిగినప్పుడు నాడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని తొలగించాలని అప్పటి ప్రధాని వాజ్ పేయి ప్రయత్నించినప్పుడు బాల్ ఠాక్రే అడ్డుపడ్డారని ఆ కథనంలో పేర్కొంది.