: పొరపాటు ట్వీట్.. పన్నీర్ సెల్వంను కేరళ సీఎంగా చేసిన కేంద్ర మంత్రి!
కేరళ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనను కలిశారంటూ కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కేంద్ర మంత్రి అయి ఉండి, తనను కలిసింది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నారా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంతకీ, రాం విలాస్ పాశ్వాన్ ఎందుకు ట్వీట్ చేశారంటే.. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన్ని కలిశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాం విలాస్ పోస్ట్ చేసే క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పేరు విషయంలో పొరపాటు పడ్డారు. అయితే, నెటిజన్ల ట్వీట్లతో తాను పొరపాటు పడ్డాననే విషయం గ్రహించిన రాం విలాస్, ఆ ట్వీట్ ను డిలీట్ చేసి..కేరళ సీఎం పినరయి విజయన్ అంటూ మళ్లీ పోస్ట్ చేయడం గమనార్హం.