: ఒక తెలుగోడిగా నా మద్దతు ఉంటుంది: సంపూర్ణేష్ బాబు
ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయమై ఒక తెలుగు వాడిగా తన మద్దతు ఉంటుందని ప్రముఖ హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘జల్లికట్టు’పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తి వేయాలని తమిళ ప్రజలు చేసిన పోరాటం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో త్వరలో నిర్వహించే మౌన నిరసన కార్యక్రమంలోతాను పాల్గొంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తనకు ఎటువంటి ఆహ్వానం లేదని, స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నానని చెప్పారు. ఈ ‘మౌన నిరసన’ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారనే విషయం తనకు తెలియదని సంపూ చెప్పారు.