: 'దేశ్ బచావో' పోస్టర్ ను విడుదల చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్


ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే, తిరగబడతామంటూ హెచ్చరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 26న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా కోసం జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రతి ఆంధ్రుడు ఓ సైనికుడై కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, ఆయన 'దేశ్ బచావో' పేరిట ఓ పోస్టర్ ను విడుదల చేశారు. వాస్తవానికి ఈ పోస్టర్ ను ఫిబ్రవరి 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే, అంటే ఈ రోజు ఆయన పోస్టర్ విడుదల చేశారు.

జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో నిరసన కార్యక్రమానికి యువత కదలి రావాలని పవన్ పిలుపునిచ్చారు. జనసేన నిరసనను ఓ మ్యూజికల్ ఆల్బం ద్వారా వ్యక్తం చేస్తామని... ఉద్యమ నినాదాన్ని ఆ ఆల్బం ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతుందని ఆయన తెలిపారు. అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు ఆల్బం ద్వారా జనసేన తన గొంతుకను వినిపిస్తుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News