: రోడ్లకు సమాంతరంగా సైకిల్ ట్రాక్‌లు: కేంద్రమంత్రి గడ్కరీ
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం నడుం బిగించింది. కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రధాన రహదారుల వెంబడి సైకిల్ ట్రాక్‌లు నిర్మించనున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. దేశంలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతామని పేర్కొన్నారు. పెట్రోలు బంక్‌ల మాదిరిగా ఎక్కడికక్కడ ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.