: భారత సంతతికి చెందిన మారిషస్ ప్రధాని రాజీనామా... తదుపరి ప్రధానిగా తనయుడి నియామకం!
భారత సంతతికి చెందిన మారిషస్ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ (86) తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను దేశాధ్యక్షుడు అమీనా గురిబ్ ఫకీమ్ కు అందజేశారు. అలాగే, దేశ ప్రధానిగా మిలిటెంట్ సోషలిస్ట్ మూవ్ మెంట్ పార్టీకి చెందిన కీలక నేత, తన కుమారుడైన ఆర్థిక మంత్రి ప్రవింద్ జగన్నాథ్ (50) ను నియమించాలంటూ అధ్యక్షుడికి ఆయన నియామక లేఖ రాశారు. దీంతో ఆయన ప్రవింద్ ను మారిషస్ ప్రధానిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. నేడు దేశానికి చీకటి దినమని తెలిపింది. ఇది తండ్రీ కొడుకుల ఒప్పందమని మండిపడింది. కాగా, ప్రధానిగా రాజీనామా చేసిన అనంతరం జగన్నాథ్ మాట్లాడుతూ, యంగ్, డైనమిక్ నాయకుడిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు వీలుగా రాజీనామా చేశానని తెలిపారు.