: జల్లికట్టు ఉద్యమం వెనుక ఐఎస్ఐ: సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు
జల్లికట్టు ఉద్యమం వెనుక ఐఎస్ఐ ఉందంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, జల్లికట్టు ఉద్యమం తొలుత ప్రశాంతంగా సాగిందని అన్నారు. అయితే మొదట ఆ ఉద్యమాన్ని నడిపిన వారు ఇప్పుడు లేరని ఆయన చెప్పారు. ఇప్పుడక్కడ సంఘ విద్రోహశక్తులు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఐఎస్ఐ ప్రవేశించిన తరువాతే ఉద్యమం హింసాత్మకంగా మారిందని ఆయన చెప్పారు. జల్లికట్టు కోసం తాను ముందు నుంచి పోరాడుతున్నానని, కాంగ్రెస్సే దానిని నిషేధించిందని ఆయన తెలిపారు. జల్లికట్టు పట్ల తాము ముందు నుంచి సానుభూతితో ఉన్నామని ఆయన చెప్పారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కావాలని ఉద్యమకారులంటున్నారని, అదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.