: ఫేస్ బుక్ లో అమ్మకానికి హెలికాప్టర్!


సోషల్ మీడియా ఫేస్ బుక్ ఈ మధ్యే  మార్కెట్ ప్లేస్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిని ఆధారం చేసుకుని ఓ వినియోగదారు హెలికాప్టర్ ను అమ్మకానికి పెట్టడం విశేషం. ఫ్లాట్స్, ఫ్లాట్ మేట్స్ పేరుతో ఉన్న ఈ ఫేస్ బుక్ పేజ్ లో 2009 మోడల్ కు చెందిన హెలికాప్టర్ అమ్మకానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దీని ధర 2.8 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. ఈ హెలికాప్టర్ కెపాసిటీ ఆరు సీట్లని తెలిపారు. గంటకు 60 లీటర్ల ఇంధనం ఖర్చయ్యే ఈ హెలికాప్టర్ గంటకు 200 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్నవారు ఇన్ బాక్స్ లో తమను సంప్రదించాలని సూచించారు. ఇది కలకలం రేపుతోంది. ఒక ప్రైవేట్ గ్రూప్ ఇంత పబ్లిగ్గా హెలికాప్టర్ అమ్మకానికి పెట్టడం ఆసక్తి రేపుతోంది. కాగా, ఈ ఫేస్ బుక్ పేజ్ నిర్వాహకులు గుర్గావ్ కు చెందినవారుగా తెలుస్తోంది. ఎలాంటి బ్రోకరేజ్ చార్జీలు చెల్లించకుండా ఫ్లాట్లను అద్దెకు ఇచ్చేందుకు, తీసుకునేందుకు ఈ పేజీ ఎంతో ఉపయోగపడుతోందని అడ్మిన్ చెబుతున్నారు. కాగా, ఈ పేజ్ ను 65,131 మంది అనుసరించడం విశేషం. 

  • Loading...

More Telugu News