: ఆ విషయం తెలిస్తే పవన్ ఇలా మాట్లాడరు: అశోక్ గజపతి రాజు
ప్రత్యేక హోదాపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏం ఊహించుకుంటున్నారో తెలియదని, దీంతో ప్రయోజనం లేదని తెలిస్తే పవన్ ఇలా మాట్లాడరని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజ్ బాగుందని, చాలా రాష్ట్రాలకు ఇప్పటికే ప్రత్యేక హోదా ఉందని, దీంతో, ఏ రాష్ట్రాలు బాగుపడ్డాయో తెలియదని అన్నారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు ‘జల్లికట్టు’ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పై ఏపీలోని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.