: అభిషేక్ కు బాస్కెట్ బాల్ ఆటగాడు ఆఫర్...ఆటగాడికి అభిషేక్ టార్గెట్!
భారత జాతీయ బాస్కెట్ బాల్ సభ్యుడైన సత్నాం సింగ్ భమరా ప్రతిష్ఠాత్మకమైన ఎన్బీఏలో స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అత్యంత ఆదరణగల ఎన్బీఏలో స్థానం సంపాదించిన అనంతరం సత్నాం సింగ్ మాట్లాడుతూ, తన బయోపిక్ ను సినిమాగా తీస్తే సంతోషమేనని చెప్పాడు. బాస్కెట్ బాల్ కు పెద్దగా ఆదరణ లేని భారత్ నుంచి అమెరికాలోని ఎన్బీఏలో ప్రాతినిధ్యం వహించేందుకు ఎదిగిన విధానం ఆకట్టుకుంటుందని తెలిపాడు. ఒకవేళ తన బయోపిక్ ఎవరైనా తీయాలనుకుంటే దానికి అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్ లలో ఎవరైనా తనపాత్రకు సరిగ్గా సరిపోతారని, వారిద్దరూ తనలాగే ఎత్తుగా ఉంటారని చెప్పాడు.
దీనిపై స్పందించిన అభిషేక్ బచ్చన్... సత్నాంసింగ్ పాత్ర పోషించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే సత్నాం తనకు ఓ ప్రామిస్ చేస్తే తాను నటిస్తానని అన్నాడు. ఎన్బీఏ ఛాంపియన్ షిప్ గెలవాలని సూచించాడు. అలా గెలిస్తే రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఆ సినిమాలో నటిస్తానని, రెమ్యూనరేషన్ గా వచ్చిన మొత్తాన్ని సత్నాం ఏ చారిటీని సూచిస్తే దానికి విరాళంగా ఇచ్చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు.