: ఎయిర్ ఇండియా నిర్వాకం... విమానం రద్దయినట్లు ఎంతకీ చెప్పని వైనం!


ముంబై నుంచి గ్వాలియర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకోవాల్సిన సమయం ఉదయం 10.30 గంటలు. అయితే, ఈ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాని స్థానంలో ‘ఎయిర్ బస్’ను తీసుకువచ్చారు. సీనియర్ సిటిజన్లు సహా 70 మంది ప్రయాణికులు నిర్దేశిత సమయానికి తమ సీట్లలో కూర్చున్నారు. విమానం ఎంతకీ టేకాఫ్ కాకపోవడంతో, ఏం జరిగిందో ప్రయాణికులకు అర్థం కాలేదు. మధ్యాహ్నం 12.30 గంటలు అయినా కూడా విమానం కదల్లేదు. లంచ్ సమయం కావడంతో ప్రయాణికులకు రిఫ్రెష్ మెంట్స్ కూడా ఇచ్చారు.

ఆ తర్వాత, సుమారు 1.30 గంటల సమయంలో అసలు విషయాన్ని ఎయిర్ ఇండియా ప్రతినిధులు బయటపెట్టారు. గ్వాలియర్ ప్రాంతంలో వాతావరణం సరిగా లేకపోవడంతో ఏటీసీ అనుమతి లభించలేదని, దీంతో, విమానం రద్దు అయినట్లు పేర్కొన్నారు. దీంతో, విమానం నుంచి దిగిపోయిన ప్రయాణికులు ఒక్కసారిగా ఎయిర్ ఇండియా ఆఫీసులోకి దూసుకెళ్లారు. విమానం రద్దు అయిన విషయం చెప్పడం ఎందుకు ఆలస్యమైందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్వాలియర్ ఏటీసీ అనుమతి కోసం తాము రెండు గంటలు ఎదురు చూశామని, ఎటువంటి సమాధానం రాకపోవడంతో సదరు విమానాన్ని రద్దు చేశామని అధికారులు చెప్పడం జరిగింది. కాగా, ప్రయాణికులకు తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, కొత్త ఎయిర్ టికెట్ల్లు కూడా ఇచ్చామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ, తమకు ఢిల్లీకి విమానం ఏర్పాటు చేసి, అక్కడి నుంచి గ్వాలియర్ కు బస్సులో తీసుకువెళ్తామన్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News