: అశ్విన్, జడేజాలకు విశ్రాంతి కల్పించిన బీసీసీఐ
ఇంగ్లండ్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు రవిచంద్రన్ అశ్విన్, జడేజాలకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. ఈ మేరకు సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ తో సుదీర్ఘంగా జరుగుతున్న సిరీస్ నేపథ్యంలో... ఇప్పటికే టెస్టులు, వన్డేలన్నీ ఆడిన వీరికి విశ్రాంతి అవసరమని సెలక్టర్లు భావించారు. వీరి స్థానంలో అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్ లకు చోటు కల్పించారు. ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అమిత్ మిశ్రా కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఆడాడు. ఆ తర్వాత అతనికి ఆడే అవకాశం రాలేదు.