: మ్యూజిక్ వీడియో షూటింగ్ లో అపశ్రుతి... యువ నటుడు మృతి!
ఆస్ట్రేలియాలో మ్యూజిక్ వీడియో షూటింగ్ లో అపశ్రుతి చేసుకుంది. బ్రిస్బేన్ లోని ఈగల్ లేన్ లో ఉన్న బార్ లో మ్యూజిక్ వీడియో షూటింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా తుపాకీ కాల్పులు జరిపే దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా తుపాకులు ఉపయోగించారు. ఈ క్రమంలో ఇరవై ఒక్క సంవత్సరాల యువనటుడి ఛాతీలోకి తుపాకీ గుళ్లు నిజంగా దూసుకుపోవడంతో అతను చనిపోయాడు. ఈ షూటింగ్ లో ఉపయోగించిన ఆయుధాలను పరిశీలిస్తున్నామని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు మాట్లాడుతూ, ఈ ఘటనలో ఇతర నటులు, ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు.