: పెటాపై మండిపడ్డ కమలహాసన్


జంతు హక్కుల సంస్థ పెటాపై ప్రముఖ నటుడు కమలహాసన్ మండిపడ్డారు. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టును అణచివేసే హక్కు పెటాకు లేదని అన్నారు. కావాలంటే డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికాలో నిర్వహించే బుల్ రైడింగ్ రోడియోస్ ను నిషేధించేందుకు పెటా కృషి చేయాలని అన్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో అనే విషయం ప్రజలకు తెలుస్తోందని... నాయకుల రోజులు పోయాయని చెప్పారు. ప్రముఖ తమిళ హీరోలు విజయ్, సూర్యలు కూడా ఇప్పటికే పెటాపై మండిపడ్డ సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News