: హైదరాబాద్ జేఎన్టీయూలో ఉద్రిక్త వాతావరణం... భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులపై మండిపడుతూ ప్రేవేట్ కళాశాలల లెక్చరర్లు ఆందోళనకు దిగడంతో వర్సిటీలో ఈ రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2010 తర్వాత ఎంటెక్ పూర్తి చేసిన వారు టీచింగ్‌కు అనర్హులంటూ జెఎన్టీయూ జారీ చేసిన ఉత్తర్వులు తమకు నష్టం కలిగిస్తాయని వారంతా వర్సిటీ వీసీ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగి ముట్టడికి ప్రయత్నించారు. ప్రైవేటు కళాశాలల లెక్చరర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.