: జల్లికట్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కేంద్ర మంత్రి


జల్లికట్టు కోసం ఆర్డినెన్స్ సరిపోదని... చట్టం చేయాలని కోరుతూ ఓవైపు తమిళనాడులో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ ఆందోళనలు ఈ రోజు హింసాత్మక రూపం దాల్చాయి. చైన్నైలో రెచ్చిపోయిన నిరసనకారులు, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో, జల్లికట్టును నిషేధించాల్సిందే అంటూ కేంద్ర మంత్రి మేనకాగాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జల్లికట్టు క్రీడ వల్ల మూగ జంతువులు అంతులేని బాధను అనుభవిస్తాయని పిటిషన్ లో తెలిపారు. జంతువుల హక్కులను కాపాడాలని కోర్టును కోరారు.

  • Loading...

More Telugu News