: బీజేపీలో చేరడంలేదు... అసలు బీజేపీని అంతమొందించడమే నా లక్ష్యం: నరేష్ అగర్వాల్
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ములాయం సింగ్ కుడి భుజం అయిన నరేష్ అగర్వల్ బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను బీజేబీలో చేరుతున్న మాట అవాస్తవమని... తాను అఖిలేష్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీని సమూలంగా అంతమొందించడమే తన లక్ష్యమని తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ పాలనలోనే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి దిశగా సాగుతుందని చెప్పారు.