: కన్యాకుమారి, ఢిల్లీలో రూ.55 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయాలు: టీటీడీ చైర్మన్ చదలవాడ
టీటీడీ ఆధ్వర్యంలో కన్యాకుమారి, ఢిల్లీ సమీపంలో రూ.55 కోట్లతో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించనున్నట్టు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, సామాన్య భక్తుల దర్శనానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చదలవాడ తెలిపారు. స్వామి వారికి భక్తులు విరాళంగా సమర్పించే సొమ్మును వారు కోరిన విధంగా ఖర్చు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.