: వంశధార ప్రాజెక్టు నిర్మాణ సామగ్రిని తగులబెట్టిన నిరసనకారులు... తీవ్ర ఉద్రిక్తత


తమకు పరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ, 18 గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా దాడి చేసి వంశధార ప్రాజెక్టు నిర్మాణ సామగ్రిని తగులబెట్టడంతో శ్రీకాకుళం జిల్లా హీర మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం దాడి చేసిన నిరసనకారులు ప్రాజెక్టు స్థలి వద్ద విధ్వంసం సృష్టించారు. పలు వాహనాలకు, నిర్మాణ రంగ యంత్రాలకు నిప్పంటించారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసు బలగాలను పంపే లోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరిహారం విషయంలో ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేస్తోందని ప్రజలు ఆరోపించారు. ఘటనా స్థలితో పాటు 18 గ్రామాల్లో ఆంక్షలను అమలు చేస్తున్న పోలీసులు, ఈ ప్రాంతంలో భారీగా మోహరించారు. ప్రాజెక్టు నిర్మాణ సామగ్రి విధ్వంసంపై కేసులు పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News