: మారిపోయిన ములాయం నేమ్ ప్లేట్... ఇక 'గార్డియన్'!


అది లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయం...!
కార్యాలయం ప్రహరీ గోడపై దశాబ్దాలుగా ఉన్న పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ నేమ్ ప్లేటు శనివారం రాత్రి 7 గంటల సమయంలో మారిపోయింది. ములాయం సింగ్ యాదవ్ కింద 'జాతీయ అధ్యక్షుడు' అని ఉండాల్సిన అక్షరాల స్థానంలో 'సంరక్షక్' అని చేరింది. ఆ బోర్డు కింద 'అఖిలేష్ యాదవ్, జాతీయ అధ్యక్షుడు' అన్న పదాన్ని చేర్చారు.

కాగా, ఎలక్షన్ కమిషన్ అఖిలేష్ వర్గాన్ని గుర్తిస్తూ, నిర్ణయించిన రోజే అఖిలేష్ యాదవ్ నేమ్ ప్లేట్ ఆ గోడపై చేరిపోగా, దానిపైనే ములాయం జాతీయ అధ్యక్షుడన్న బోర్డు కూడా ఉంది. ఆపై వారం తరువాత నిన్న ములాయం సింగ్ యాదవ్ ను పార్టీ గార్డియన్ గా పేర్కొంటూ నేమ్ ప్లేట్ మార్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News