: ఏపీలో ఘోర రైలు ప్రమాదం - 25 మంది మృతి


విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జగదల్ పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ కొమరాడ మండలం కూనేరు వద్ద పట్టాలు తప్పింది. నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరుగగా, 25 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెండు ఏసీ బోగీలు, రెండు రిజర్వేషన్, రెండు జనరల్, గార్డు బోగీలు పట్టాలు తప్పాయి.

ఎస్ 8, ఎస్ 9 స్లీపర్ బోగీలు బాగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ చంద్రలేఖ ముఖర్జీ మెడికల్‌ రిలీఫ్‌ ట్రైన్‌ తో చేరుకున్నారు. గాయపడ్డ వారిని పార్వతీపురం, రాయ్ గఢ్, విశాఖ ఆసుపత్రులకు తరలించారు. మృతులు, గాయపడిన వారి బంధువులకు సమాచారాన్ని అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు 8106053006, 8500358712లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News