: వరుణ్ గాంధీకి షాకిచ్చిన బీజేపీ అధిష్ఠానం!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్న బీజేపీ నేత వరుణ్ గాంధీకి పార్టీ అధిష్ఠానం షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార సారధులుగా ఎంపిక చేసిన 40 మంది నేతల జాబితాలో వరుణ్ గాంధీకి బీజేపీ స్థానం కల్పించలేదు. అనారోగ్య కారణాలతో ఎల్.కే.అద్వానీ, వయసు మీద పడిందంటూ మురళీ మనోహర్ జోషీలకు కూడా ఈ జాబితాలో స్థానం దక్కలేదు.
కాగా, ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతీ ఇరానీ, ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే తదితరులకు స్థానం కల్పించారు. అయితే ఫైర్ బ్రాండ్ గా పేరొందిన వరుణ్ గాంధీ అధిష్ఠానాన్ని లెక్క చేయనట్లుగా, స్వతంత్రంగా వ్యవహరిస్తుండటం వల్లే పార్టీ అతనికి షాకిచ్చిందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.