: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి, ఆత్మహత్యకు పాల్పడ్డ ఇంజనీర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంజనీర్ గా పని చేస్తున్న వెంకటేశ్వర్లు ఓ కాంట్రాక్టర్ నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీంతో ఆయనను ఇంటికి తీసుకెళ్లి విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. అయితే భవనంపైకి వెళ్లిన వెంకటేశ్వర్లు అక్కడి నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టు మార్టంకు తరలించారు.