: ఈపీఎఫ్ నిరాకరించే ప్రైవేట్ సంస్థలపై చర్యలు తప్పవంటున్న కర్ణాటక!


ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చట్టం ప్రకారం సాంఘిక భద్రత ప్రయోజనాలను నిరాకరించే ప్రైవేటు సంస్థలపై కర్ణాటక ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. కర్ణాటకలో ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు కర్ణాటక అడిషినల్ సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ వి.విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంట్రాక్టు ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులకు ఇప్పటికీ ఈపీఎఫ్ ప్రయోజనాలు అందడం లేదని అన్నారు.

ఈ విషయమై రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ట్రేడ్ యూనియన్లు, యాజమాన్యాల సంఘాలతో సంప్రదింపులు జరుపుతామని, కార్మికులను స్వచ్ఛందంగా ఈ పథకంలో చేర్పించాలని కోరతామని చెప్పారు. ఈ విషయంలో విఫలమైన యాజమాన్యాలపై ఏప్రిల్ నుంచి కఠిన చర్యలు తప్పవని అన్నారు. అర్హులైన కార్మికులు, ఉద్యోగులు 2017 మార్చి 31 లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఈపీఎఫ్ కు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ను ప్రారంభించామని ఈ సందర్భంగా విజయ్ కుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News