: ప్రవాసాంధ్రులు కలిసికట్టుగా ఉండాలి...జన్మభూమి రుణం తీర్చుకోవాలి: సీఎం చంద్రబాబు


ప్రవాసాంధ్రులు కలిసికట్టుగా ఉండాలని, జన్మభూమి రుణం తీర్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన, ఈరోజు జ్యూరిచ్ నగరానికి వెళ్లారు. అక్కడి ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ సంఘాలు, ఏ పార్టీల్లో ఉన్నా దేశం కోసం అంతా కలిసికట్టుగా ఉండాలని, అందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తానని అన్నారు. ప్రవాసాంధ్రులు స్థానిక రాజకీయాల్లో పాలు పంచుకునేలా ఎదగాలని, ఎక్కడ ఉన్నా రాజకీయ స్పృహ కల్గి ఉండాలని కోరారు. 

  • Loading...

More Telugu News