: మరి, ఈ రోజు టీడీపీ ర్యాలీకి అనుమతి ఎలా ఇచ్చారు?: బొత్స సత్యనారాయణ


'వెలగపూడి సచివాలయం వద్ద జగన్ పర్యటనకు ఆంక్షలు విధించిన పోలీసులు, ఈ రోజు టీడీపీ ర్యాలీకి అనుమతి ఎలా ఇచ్చారు?' అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ టూర్ పై టీడీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నోరుపారేసుకోవడం సబబు కాదన్నారు. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేకే టీడీపీ అడ్డగోలు విమర్శలు చేస్తోందన్నారు. ఏ పార్టీ నేత అయినా పర్యటించినప్పుడు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం ఎక్కడైనా ఉందా? ఏపీలో మిగులు విద్యుత్ ఉండగా ఛార్జీలు పెంచడం దేనికి? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ అయినా అమలు చేశారా? దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. 

  • Loading...

More Telugu News