: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల తోపులాట!


గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల పోటాపోటీ నిరసనల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఇటీవల పర్యటించారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటించిన ప్రాంతాల్లో టీడీపీ నాయకులు పసుపు నీళ్లు చల్లి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇందుకు పోటీగా తాడేపల్లిలో సంప్రోక్షణ నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో, వారి మధ్య తోపులాట జరిగింది.

  • Loading...

More Telugu News