: హైదరాబాద్ లాడ్జ్ లో బెంబేలెత్తించిన దెయ్యం!


రామ్ గోపాల్ వర్మ హర్రర్ సినిమాలో జరిగినట్టే జరిగింది. ఓ దెయ్యం అక్కడున్న వారికి గుండెలు ఆగిపోయినంత పని చేసింది. వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్ర నుంచి డాక్టర్ సయ్యద్ కుటుంబం హైదరాబాద్ చూసేందుకు వచ్చారు. చార్మినార్ కు దగ్గర్లో ఉన్న కోజీ లాడ్జ్ లో వీరు బస చేశారు. మూడు రూమ్ లు తీసుకున్నారు. రెండు రూమ్ లలో కుటుంబ సభ్యులు పడుకోగా, మూడో రూమ్ లో డాక్టర్ సయ్యద్ తన తండ్రితో పాటు పడుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో... ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. అరుపులు విని పక్క గదుల్లో ఉన్న వారంతా బయటకు వచ్చారు. జరిగిన విషయం విని లాడ్జ్ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జ్ కు చేరుకుని, ఏం జరిగిందని డాక్టర్ ను ప్రశ్నించారు.

తామందరం గాఢ నిద్రలో ఉండగా... తల లేని మొండెం తమపై కర్రతో దాడి చేసిందని డాక్టర్ సయ్యద్ తెలిపారు. తాము ప్రతిఘటించే ప్రయత్నం చేసేలోగానే తమను గోడకేసి కొట్టిందని చెప్పారు. ఆయన మాటలు విన్న పోలీసులు సైతం కంగుతిన్నారు. లాడ్జి యజమానైతే బిక్కచచ్చి పోయాడు. గతంలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని లాడ్జి ఓనర్ తెలిపాడు. అయితే, తండ్రీకొడుకులు తీవ్రగాయాలతో గది నుంచి బయటకు రావడం గమనార్హం. సయ్యద్ చెబుతున్న మాటల్లో నిజమెంత? గదిలో ఇంకేదైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News