: పాకిస్థాన్ లోని మార్కెట్ లో పేలుడు..12 మంది మృతి
పాకిస్థాన్ లోని ఒక మార్కెట్ లో బాంబు పేలిన సంఘటనలో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఖుర్రం ఏజెన్సీలోని పరాచినార్ ప్రాంతంలోని సబ్జి మాండి (కూరగాయల మార్కెట్) లో ఈ దారుణం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఐఈడీ బాంబు పేలిందని, పన్నెండు మంది గాయపడగా, మరో 30 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి ఆర్మీతో పాటు ఇతర అధికారులు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.