: ప్రేమజంటలు విడిపోయిన తర్వాత రేప్ కేసు పెట్టడం ఒక ట్రెండ్ అయిపోయింది!: బాంబే హైకోర్టు


పెళ్లికంటే ముందు పరస్పర అంగీకారంతో జరిగిన శృంగారాన్ని చదువుకున్న ఆడపిల్లలెవరూ రేప్ అని అనరని, తద్వారా ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి ముందే తెలుసు కనుక, ఎవరి నిర్ణయానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని, తర్వాత వదిలేశాడంటూ 21 సంవత్సరాల యువకుడిపై  ఓ యువతి కేసు పెట్టింది.

దీంతో, ముందస్తు బెయిల్ కోసం సదరు యువకుడు కోర్టును ఆశ్రయించాడు. అతనికి ముందస్తు బెయిల్ ను జస్టిస్ మృదుల భట్కర్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా మృదుల భట్కర్ స్పందిస్తూ.. ప్రేమించుకున్న జంటలు విడిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తిపై రేప్ కేసు పెట్టడం ఒక ట్రెండ్ గా మారిపోయిందన్నారు. ఈ కేసుల విషయంలో కోర్టులు మాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేయడం ప్రలోభపెట్టడం కిందకు రాదని, అయితే ప్రతి రేప్ కేసుకు ఇది వర్తించదని అన్నారు.

  • Loading...

More Telugu News