: కోర్టులో లొంగిపోయిన కర్ణాటక ఎమ్మెల్యే బాలకృష్ణ


ఎస్ఐ, సీఐ లను అసభ్యపదజాలంతో దూషించిన కేసులో కర్ణాటకలోని మాగడి ఎమ్మెల్యే బాలక‌ృష్ణ ఒకటవ జేఎంఎఫ్ సీ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసు విషయమై తనను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారన్న విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన లాయర్ తో కలిసి నిన్న కోర్టుకు వెళ్లి లొంగిపోయారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన వివరాలు.. మాగడి తాలూకాలోని అయ్యండనహళ్లిలో ఇటీవల జరిగిన జాతరలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది.

ఈ సందర్భంగా తమ పార్టీకి చెందిన వారిపై దాడులకు పాల్పడ్డారని, నిందితులను అరెస్టు చేయలేదంటూ కూదురు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సీఐలను అసభ్యపదజాలంతో ఎమ్మెల్యే దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రమేశ్ కు కూదూరు సీఐ నందీశ్  ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  • Loading...

More Telugu News