: యూఎస్ కొత్త అధ్యక్షుడు ట్రంప్ తొలి సంతకం ఈ ఫైల్ పైనే చేశారు!


తాను అధికారంలోకి వస్తే ‘ఒబామా కేర్’ ఆరోగ్య పథకాన్ని మార్చి తీరుతానని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా నిన్న బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆయన సంతకం చేసింది ఇందుకు సంబంధించిన ఫైల్ పైనే. తన ప్రసంగం ముగిసిన తర్వాత ఓవల్ కార్యాలయంలోకి ప్రవేశించిన ట్రంప్, ‘ఒబామా కేర్’ కు సంబంధించిన నిబంధనలను సడలించాలని ఏజెన్సీలకు సూచించారు. సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. ఈ ఆర్డర్ లో ఉన్న వివరాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. కాగా, కొత్తగా నియమితులైన రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటిస్, హాంలాండ్ సెక్యూరిటీ మంత్రి జాన్ కెల్లీలకు సంబంధించిన కమిషన్ల పై కూడా ట్రంప్ సంతకాలు చేశారు. 

  • Loading...

More Telugu News