: యువీ గురించి హాజెల్ కీచ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది!
దేశమంతా ఇప్పుడు డ్యాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించే మాట్లాడుకుంటోంది. ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిన యువీ... కేవలం 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. సహచరుడు ధోనీతో కలసి ఇంగ్లీష్ బౌలర్లను చితకబాదాడు. తన భర్త ఆటతీరును చూసి అతని భార్య హాజెల్ కీచ్ మురిసిపోయింది. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
"అతని పేరు మధ్యలో ఫియర్స్ (విధ్వంసక) అనే పదం ఉండే బాగుండేది. 127 బంతుల్లో 150 పరుగులు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇంగ్లండ్ పై ఇండియా 2-0తో గెలిచింది. క్యాన్సర్ నుంచి కోలుకోవడమే కాదు... జట్టులో కూడా స్థానం సంపాదించాడు. క్యాన్సర్ నుంచి కోలుకోవడం వేరు... క్యాన్సర్ ను జయించడం వేరు" అని హాజెల్ ట్వీట్ చేసింది. ఆమె పోస్టుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.