: మొన‌గాళ్లంటే ఆంధ్రావాళ్లే.. జ‌ల్లిక‌ట్టు నిర‌స‌న‌లో ఏపీ వాసుల‌పై త‌మిళుల ప్ర‌శంస‌!


జ‌ల్లిక‌ట్టుకు మద్ద‌తుగా త‌మిళ‌నాడులోని మెరీనా బీచ్ వ‌ద్ద జ‌రుగుతున్న ఆందోళ‌న‌లో ఆంధ్రుల‌పై ప్ర‌శంసల జ‌ల్లు కురిసింది. మ‌గాళ్లంటే వాళ్లే అంటూ ముక్త కంఠంతో కొనియాడారు. దీనికి కార‌ణం కూడా ఉంది. త‌మిళుల సంప్ర‌దాయ క్రీడ అయిన జ‌ల్లిక‌ట్టుతోపాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో నిర్వ‌హించే కోడి పందేలను కోర్టులు నిషేధించాయి. దీంతో త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హ‌ణ‌కు ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో కోర్టు ఉత్త‌ర్వుల‌ను ధిక్క‌రించి ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వ‌హించారు. కొన్ని చోట్ల కోళ్ల కాళ్ల‌కు క‌త్తులు క‌ట్టి, మ‌రికొన్ని చోట్ల క‌ట్ట‌కుండా మొత్తానికి పందేలైతే జోరుగా సాగాయి. దీనిని గుర్తు చేసుకున్న త‌మిళ యువ‌త ''కోర్టు ఆదేశాలున్నా గుట్టుచ‌ప్పుడు కాకుండా పందేలు నిర్వ‌హించిన ఆంధ్రా వాసుల్లారా.. మొనగాళ్లంటే మీరే.. అనుకున్న‌ట్టే కోడి పందేలు పూర్తి చేశారు. మేం మాత్రం ఇంకా జ‌ల్లిక‌ట్టు జ‌రుపుకోలేక‌పోతున్నాం'' అంటూ నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News