: బ్రేకింగ్ న్యూస్... ఫలించిన తమిళుల పోరాటం... ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపిన కేంద్రం


తమిళనాట యువకులు చేస్తున్న పోరాటం ఫలించింది. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తమిళుల డిమాండ్లు పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం... తమిళనాడు ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని న్యాయశాఖకు పంపింది. కేంద్రం పంపిన ఆర్డినెన్స్ ను కొద్దిపాటి మార్పులతో కేంద్ర న్యాయశాఖ ఆమోదించింది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపింది. రాష్ట్రపతి ఆమోదించగానే ఆర్డినెన్స్ వెలువడుతుంది. దీనిపట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. 

  • Loading...

More Telugu News