: అఖిలేష్ యాదవ్ జాబితాలో శివపాల్ యాదవ్ కు స్థానం
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ 199 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తాను తీవ్రంగా వ్యతిరేకించే బాబాయ్ శివపాల్ యాదవ్ కు అఖిలేష్ స్థానం కల్పించడం విశేషం. ములాయం సింగ్ యాదవ్ తో అఖిలేష్ కు ఏర్పడిన విభేదాలకు ప్రధాన కారణంగా అమర్ సింగ్, శివపాల్ యాదవ్ లుగా జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. అలాంటిది తొలి జాబితాలో శివపాల్ యాదవ్ కు అఖిలేష్ స్థానం కల్పించడంతో రెండు వర్గాల మధ్య వివాదం సమసిపోయిందనే సంకేతాలు వెలువడ్డాయి. గతంలో అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వేర్వేరుగా జాబితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ములాయం విడుదల చేసిన జాబితాకు కొన్ని మార్పులు చేర్పులు చేసి, తాజా జాబితాను అఖిలేష్ యాదవ్ విడుదల చేయడం జరిగింది.