: చనిపోయిన వ్య‌క్తికి చెందిన‌ పాత నోట్లను తీసుకోని ఆర్‌బీఐ


భోపాల్‌కు చెందిన‌ శివ్‌చరన్‌ సింగ్‌ మారన్‌ (93) అనే వ్య‌క్తి గ‌త ఏడాది డిసెంబ‌రు 26న అనారోగ్యం కార‌ణంగా మృతిచెందాడు. అయితే, ఆయన అంత్యక్రియల అనంత‌రం అత‌డి కుటుంబ సభ్యులు ఇటీవలే ఇల్లును శుభ్రం చేస్తోన్న స‌మ‌యంలో వారికి శివ్‌చర‌న్‌ గదిలోని ఓ సొరుగులో రూ.50 వేలు పాత ఐదువందల నోట్లు క‌నిపించాయి. వాటిని తీసుకొని త‌న ఖాతాలో జ‌మ‌ చేసుకునేందుకు ఆయన కుమారుడు సింగ్‌ మారన్ ఆర్‌బీఐకి వెళ్లాడు.

లేటుగా డ‌బ్బు జ‌మ చేసుకుంటున్న వారు ఆ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఆర్‌బీఐకి చెప్పాల్సి ఉంటుంది. అయితే, ఆ డ‌బ్బును తీసుకునేందుకు ఆర్‌బీఐ సిబ్బంది అంగీక‌రించ‌లేదు. 93 ఏళ్ల త‌న‌ తండ్రి జ్ఞాపకశక్తిని కోల్పోవడం వల్లే ఆ డబ్బు  ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో వివరాలు ఎవరికీ చెప్పలేదని ఆర్‌బీఐకి ఆయ‌న‌ వివరణ ఇచ్చాడు. చివ‌ర‌కు త‌న తండ్రి చనిపోయినప్పుడు నమోదు చేసిన ధ్రువీకరణ పత్రాలు, అతడి ఆరోగ్యం వివరాలకు సంబంధించిన పత్రాలు చూపించాడు. అయిన‌ప్ప‌టికీ ఆ డ‌బ్బు తీసుకోవ‌డానికి నిరాక‌రించిన ఆర్‌బీఐ అధికారులు ప్రస్తుతం ఎన్ఆర్‌ఐలకు సంబంధించిన నోట్లను మాత్రమే తీసుకుంటున్నామ‌ని చెప్పారు. తన తండ్రికి సంబంధించిన‌ పాత నోట్ల‌ను కొత్తనోట్లలోకి మార్చుకునేందుకు ఆయ‌న ఇప్ప‌టికీ ప్రయత్నాలు జ‌రుపుతూనే ఉన్నాడు.

  • Loading...

More Telugu News