: రాష్ట్ర మంతటా ఫ్యాక్షన్ సంస్కృతిని తేవాలని జగన్ చూస్తున్నారు: సోమిరెడ్డి
రాష్ట్రమంతటా ఫ్యాక్షన్ సంస్కృతిని వ్యాప్తి చేయాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ చూస్తున్నారని, ఎమ్మెల్యే అఖిల ప్రియపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మారినంత మాత్రాన అఖిల ప్రియపై దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాలు ఫలించవని అన్నారు. జగన్ కు రైతులపై ఏ మాత్రం ప్రేమ లేదని, జగన్ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేస్తుండటంతో ఆయనకు దిక్కుతోచడం లేదని, ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కల, పగటికలగానే మిగిలిపోతుందని సోమిరెడ్డి అన్నారు.